Mehreen: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • గోపీచంద్ సరసన నాయికగా మెహ్రీన్
  • సంక్రాంతికి 'అభిమన్యుడు'గా విశాల్
  • ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్న వెంకటేశ్
  • నెంబర్ వన్ పొజిషన్ గురించి రకుల్

*  'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాల వరుస విజయాలతో డిమాండ్ తెచ్చుకున్న కథానాయిక మెహ్రీన్ తాజాగా మరో పెద్ద ఆఫర్ అందుకుంది. యాక్షన్ హీరో గోపీచంద్ సరసన నాయికగా నటించే అవకాశాన్ని పొందింది. నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
*  విశాల్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం తెలుగు వెర్షన్ కు 'అభిమన్యుడు' అనే పేరును ఖరారు చేశారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేస్తారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.
*  సీనియర్ నటుడు వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో వెంకటేశ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు, ఆ పాత్ర కాస్త నెగటివ్ ఛాయలతో సాగుతుందట.
*  'నెంబర్ వన్ పొజిషన్ పొందాలని అందరూ కోరుకుంటారు, అయితే అది అంత ఈజీ కాదు' అంటోంది అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్. "ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు కానీ, దాని వెనుక చాలా కష్టం వుంటుంది. ఆ కష్టంతో పాటు అదృష్టం కలసి వస్తే, నెంబర్ వన్ అవ్వచ్చు. అయితే, తర్వాత దానిని నిలుపుకోవడానికి మరింత కష్టపడాలి. ఇక్కడ ఏదీ కూడా ఊరికే రాదు" అని చెప్పింది రకుల్.  

More Telugu News