India: భారత్ లో లీటర్ పెట్రోలు 300 రూపాయలు కానుందా?

  • సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం
  • యుద్ధం మొదలైతే క్రూడ్ ఆయిల్ పై ప్రభావం
  • లీటర్ పెట్రోలు 300 రూపాయలయ్యే అవకాశం 

సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. గత కొంత కాలంగా ఈ రెండు దేశాలు చేపట్టిన చర్యలు యుద్ధం దిశగా పయనిస్తున్నాయి. ఈ పరిస్థితులపై అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని, ప్రధానంగా రెండు దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే భారతీయ చమురు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ముడి చమురు సరఫరా తగ్గిపోతుందని, తద్వారా ధర 500 శాతం పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. దీంతో వివిధ దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ లో ప్రస్తుతం 70 రూపాయలకు దొరుకుతున్న లీటర్ పెట్రోల్ ధర 300 రూపాయలు అయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అక్కడితో ఆగిపోతే ప్రశాంతంగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. 

More Telugu News