srimukhi: నందు, శ్రీముఖి కొత్త సినిమా టీజ‌ర్ విడుద‌ల‌!

  • కె.ఎస్‌ వాసు దర్శకత్వంలో ‘కుటుంబ కథా చిత్రం’ సినిమా
  • సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా టీజ‌ర్ అదుర్స్
  • ఫస్ట్‌లుక్ కూడా విడుద‌ల‌

కె.ఎస్‌ వాసు దర్శకత్వంలో నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకుంటోన్న ‘కుటుంబ కథా చిత్రం’ సినిమా టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది. భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థ బ్యానర్ పై దాసరి భాస్కర్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన టీజర్ లో నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు మ‌ధ్య చిత్రీక‌రించిన స‌న్నివేశాల‌ను చూపించారు. దీనిని బట్టి చూస్తే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కూడా విడుద‌లైంది. సునీల్‌ కశ్యప్ ఈ సినిమాకి స్వ‌రాలు అందిస్తున్నారు.   

More Telugu News