వాణి విశ్వ‌నాథ్ నాకు పోటీనా?: ఎమ్మెల్యే రోజా

16-11-2017 Thu 17:45
  • నేను అలా అనుకోవ‌డం లేదు
  • నేను ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాను
  • ఎన్నో కష్టాల‌ను ఎదుర్కున్నాను
  • టీడీపీ అధికార పార్టీ కాబ‌ట్టి కొంద‌రు అందులో చేరుదామ‌నుకుంటున్నారు

సినీన‌టి వాణి విశ్వ‌నాథ్ టీడీపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకి పోటీగా దింపుతార‌ని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ రోజు రోజా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ విష‌యంపై స్పందించారు.

వాణి విశ్వ‌నాథ్ నాకు పోటీయా? అని, తాను అలా అనుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. తాను ఎన్నో విష‌యాల‌పై పోరాడి రాజ‌కీయంగా ఎన్నో ఒడిదుడుకుల‌ను చూశానని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని అన్నారు. టీడీపీ అధికార పార్టీ కాబ‌ట్టి కొంద‌రు అందులో చేరుదామ‌నుకుంటున్నారని తెలిపారు. రాజ‌కీయాలంటే ఏంటో ఇందులోకి వ‌స్తేనే తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

కాగా, చంద్ర‌బాబు నాయుడి కుమారుడు నారా లోకేశ్ మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఎన్నో అన‌ర్థాలు జ‌రిగాయ‌ని రోజా ఎద్దేవా చేశారు. దేశ చ‌రిత్రలోనే ఏ ముఖ్య‌మంత్రి కొడుకూ దొంగ‌దారిలో మంత్రి కాలేదని అన్నారు. ప్ర‌జ‌ల ద్వారా ఎన్నిక కాబ‌డితేనే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉంటుందని రోజా చెప్పారు.