vijay antony: 'ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్ లో విజయ్ ఆంటోని!

  • విజయ్ ఆంటోని తాజా చిత్రంగా 'ఇంద్రసేన'
  • ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
  • తదుపరి సినిమాగా 'ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్
  • సీనియర్ నటి అంబిక రీ ఎంట్రీ

తమిళ .. తెలుగు భాషల్లోని ప్రేక్షకుల్లో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వుంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు వైవిధ్యభరితంగా ఉండటమే అందుకు కారణం. తమిళంలో 'అన్నాదురై' .. తెలుగులో 'ఇంద్రసేన'తో ఈ నెల 30న ఆడియన్స్ ముందుకు రావడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఒక వైపున ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో వైపున విజయ్ ఆంటోని తదుపరి సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఆయన నెక్స్ట్ మూవీగా 'ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్ వుండనున్నట్టు సమాచారం. సామాజిక సమస్యలను 'ట్రాఫిక్ రామస్వామి' ఎలా ఎదిరించాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో యువకుడైన రామస్వామిగా విజయ్ ఆంటోని .. వృద్ధుడైన రామస్వామిగా ఎస్.ఎ.చంద్రశేఖర్ నటించనున్నారు. సీనియర్ నటి అంబిక చాలా సంవత్సరాల తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇక త్వరలో రానున్న 'ఇంద్రసేన' సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.    

More Telugu News