juli briskman: ట్రంప్ కి షాకిచ్చిన మహిళకు బంపర్ ఆఫర్...మద్దతుగా నిలిచిన 3,000 మంది

  • ట్రంప్ కు మధ్యవేలు చూపించి అసహనం వ్యక్తం చేసిన జూలీ బ్రిస్క్ మాన్
  • సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్న కాంట్రాక్టర్ అకిమా
  • 7 రోజుల్లో 3,000 మంది 70,000 డాలర్ల వితరణ
  • లక్ష డాలర్లు సేకరించి ఇస్తానంటున్న అకిమా

వర్జీనియాలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు మధ్యవేలు చూపించి అసహనాన్ని ప్రకటించిన జూలీ బ్రిస్క్‌ మాన్‌ కు 3,000 మంది మద్దతుగా నిలిచారు. రెండు వారాల కింద ఆమె ట్రంప్ కు షాకివ్వగా ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవన్న ఆందోళనతో ఆమె పని చేస్తున్న సంస్థ అమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

అప్పటి నుంచి ఆమె ఉపాధికోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఆమె ఆర్థిక అవసరాల నిర్వహణకు అకిమా అనే ప్రభుత్వ కాంట్రాక్టర్‌ సోషల్ మీడియా మాధ్యమంగా క్రౌడ్ ఫండింగ్ సేకరణ ప్రారంభించారు. దీంతో నెటిజన్లు ఉదారంగా స్పదించారు. కేవలం 7 రోజుల్లోనే 3,000 మంది నెటిజన్లు 70,000 డాలర్లు పంపించారు. మొత్తం లక్ష డాలర్లు సేకరించి ఆమెకు అందజేస్తానని అకిమా తెలిపారు. 

More Telugu News