junior ntr: జూనియ‌ర్ ఎన్టీఆర్ 'టెంప‌ర్‌' హిందీ రీమేక్‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌?

  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న రోహిత్ శెట్టి
  • ర‌ణ్‌వీర్ స‌ర‌స‌న జాహ్న‌వి క‌పూర్ కాద‌న్న ద‌ర్శ‌కుడు
  • హీరోయిన్‌ను ఇంకా అనుకోలేద‌ని వివ‌ర‌ణ‌

తెలుగులో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 'టెంప‌ర్‌' చిత్రం, హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ అయితే ఎన్టీఆర్ పోషించిన పాత్ర‌కు పూర్తి న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న రోహిత్ శెట్టి తెలిపాడు. అలాగే ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్ స‌ర‌స‌న శ్రీదేవి కుమార్తె జాహ్న‌వి క‌పూర్ న‌టించ‌నుందంటూ వ‌స్తున్న వార్తల‌ను ఆయ‌న ఖండించాడు.

'అస‌లు ఇలాంటి వార్త‌లు ఎక్క‌డి నుంచి పుడ‌తాయో తెలీదు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ విష‌యం ఆలోచించ‌నే లేదు. వ‌చ్చే ఏడాది మొదట్లో చిత్ర ఫైన‌ల్ డ్రాఫ్ట్ పూర్త‌వుతుంది. ఆ త‌ర్వాత‌ న‌టీన‌టులు ఎవ‌ర‌నే విష‌యాన్ని నిర్ణ‌యిస్తాం' అని రోహిత్ శెట్టి అన్నాడు. మాతృక నుంచి కేవ‌లం 20 శాతం క‌థాంశాన్ని మాత్ర‌మే తీసుకుంటామ‌ని, మిగ‌తా మొత్తాన్ని బాలీవుడ్ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లుగా మారుస్తామని రోహిత్ వివ‌రించాడు.

More Telugu News