first test: గంట మోగించిన లక్ష్మణ్.. ఒక్క బంతి కూడా ఆడకుండానే మైదానాన్ని వీడిన ఆటగాళ్లు

  • గతంలో ఈడెన్ లో భారీ ఇన్నింగ్స్ ఆడిన లక్ష్మణ్
  • గత జ్ఞాపకాలకు గుర్తుగా నేడు స్టేడియంలో గంటను మోగించిన వీవీఎస్
  • ఆటను మరోసారి అడ్డుకున్న వర్షం

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్స్ లో 1969 నుంచి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం అన్నది ఇది రెండోసారి మాత్రమే. మరోవైపు స్టేడియంలోని గంటను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మోగించాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూలీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

2001లో ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో లక్ష్మణ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి 281 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆనాటి జ్ఞాపకాలకు గుర్తుగా నేడు స్టేడియంలోని గంటను మోగించాడు.

మరోవైపు ఆటను ప్రారంభించేందుకు శ్రీలంక ఆటగాళ్లతో పాటు టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లు మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే, ఒక్క బంతి కూడా పడకముందే, వర్షపు జల్లు మొదలవడంతో, ఆటగాళ్లంతా మైదానాన్ని వీడారు. ఇప్పుడు మళ్లీ ఆట మొదలైంది. 

More Telugu News