speech: ప్ర‌సంగం మ‌ధ్యలో మంచినీళ్లు తాగిన ట్రంప్‌... గ‌తాన్ని త‌వ్వుతున్న నెటిజ‌న్లు!

  • మూతిపెట్టి చిన్న‌పిల్లాడిలా మంచినీళ్లు తాగిన డొనాల్డ్
  • గ‌తంలో సెనేట‌ర్ రూబియోను హేళ‌న చేసిన అమెరికా అధ్య‌క్షుడు
  • వైర‌ల్ చేస్తున్న నెటిజ‌న్లు

ట్విట్ట‌ర్ జ‌నాల‌కు, డొనాల్డ్ ట్రంప్‌కి విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. ట్రంప్‌ ప‌ర్య‌ట‌న‌లు, ప్ర‌సంగాలు, రోజువారీ కార్య‌క్ర‌మాలు అన్నీ ట్విట్ట‌ర్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇటీవ‌ల ఆసియా ప‌ర్య‌ట‌న త‌ర్వాత అమెరికాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మంచి నీళ్లు తాగ‌డాన్ని కూడా నెటిజ‌న్లు వైర‌ల్‌గా మారుస్తున్నారు. వారు ఇలా చేయ‌డం వెనుక ఓ విష‌యం ఉంది.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ట్రంప్ కు వ్య‌తిరేకంగా పోటీ చేసిన సెనేట‌ర్ మార్కొ రూబియో కూడా ఓ సారి ప్ర‌సంగం మ‌ధ్య‌లో మంచి నీళ్లు తాగాడు. ఆ విష‌యాన్ని ప్ర‌చార స‌మ‌యాల్లో గుర్తు చేసి రూబియోను ట్రంప్ హేళ‌న చేశాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్ర‌సంగం మ‌ధ్య‌లో చిన్నపిల్లాడిలా మూతి పెట్టి మంచి నీళ్లు తాగ‌డంతో గ‌తాన్ని గుర్తు చేసి మ‌రీ అత‌న్ని ట్విట్ట‌ర్ జ‌నాలు హేళ‌న చేస్తున్నారు.

More Telugu News