బండ్ల గణేష్: ఇవి నంది అవార్డ్స్ కాదు.. ‘సైకిల్’ అవార్డ్స్!: నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

  • నంది అవార్డ్స్ తీరు సరిగా లేదు
  • ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం చేశారు
  • ఆ అవార్డ్స్ కు ‘సైకిల్’ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుంది
  • విమర్శలు రావడంతో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న గణేష్

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్ తీరు సరిగా లేదంటూ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ‘ఇవి నంది అవార్డ్స్ కాదు..సైకిల్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ కు సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుంది. నాడు ‘మగధీర’ సినిమాలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కు అవార్డు ఇవ్వకుండా అన్యాయం చేశారు. అప్పుడు కూడా ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం చేశారు. అప్పుడు అధికారంలో ఉంది ‘హస్తం’ కావచ్చు.

నేను అనేదేంటంటే, ‘హస్తం’ గొప్ప, ‘సైకిల్’ తక్కువ అని నేను అనట్లేదు. నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదు.. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఏ పార్టీ మీద నాకు అభిమానం, వ్యతిరేకత లేవు. నాకు అందరూ ఒకటే..అన్యాయం జరిగితే నేను మాట్లాడతాను’ అని అన్నారు. అయితే, ప్రభుత్వ అవార్డ్స్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘ఇటువంటి వ్యాఖ్యలు కరెక్టు కాదన్నారు కాబట్టి, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా..క్షమాపణలు చెబుతున్నా. కానీ, ‘మెగా’ ఫ్యామిలీకి మాత్రం అన్యాయం జరిగింది’ అని బండ్ల గణేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

More Telugu News