Aadhar card: ఆధార్-సిమ్ అనుసంధానం ఇక ఈజీ.. ఓటీపీ ద్వారా లింకింగ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

  • డిసెంబరు 1 నుంచి అందుబాటులోకి ఓటీపీ లింకేజీ
  • టెల్కోల ప్రతిపాదనకు ఓకే చెప్పిన యూఐడీఏఐ
  • ఇక ఇంటి దగ్గరి నుంచే అనుసంధానం

ఆధార్-మొబైల్ నంబరు అనుసంధానం మరింత ఈజీ అయింది. డిసెంబరు 1 నుంచి ఓటీపీ ద్వారా కూడా తమ సిమ్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మేరకు టెల్కోలకు యూఐడీఏఐ అనుమతి ఇచ్చింది. ఓటీపీ ఆధారిత సిమ్ వెరిఫికేషన్‌కు అనుమతి ఇచ్చినట్టు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వారు సమర్పించిన బ్లూప్రింట్‌కు అనుమతి ఇచ్చామని, డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఓటీపీ ద్వారా సిమ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.

మొబైల్ నంబరుకు ఆధార్ అనుసంధానం కోసం ప్రభుత్వం గత నెలలో మూడు విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా ఆపరేటర్లు చేసిన ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఆధారిత లింకింగ్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. తాజా విధానం ద్వారా మొబైల్ వినియోగదారులు ఇంటి దగ్గరి నుంచే ఓటీపీ, యాప్, ఐవీఆర్ఎస్ విధానాల ద్వారా ఆధార్‌ను లింక్ చేసుకునే అవకాశం చిక్కింది.

More Telugu News