China: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 30 వాహనాలు.. 18 మంది దుర్మరణం

  • ప్రాణాలు తీసిన పొగమంచు
  • ప్రాణాపాయ స్థితిలో మరో 11 మంది
  • కాలిపోయిన మృతదేహాలు

చైనాలోని ఓ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్‌హూయ్ రాష్ట్రంలోని షుయాంగ్ పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పొగమంచు దట్టంగా కురుస్తుండడం వల్ల రహదారిపై వాహనాలు కనిపించలేదు. దీంతో దాదాపు 30 వరకు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ప్రయాణికులు తేరుకునేలోపే కొందరు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారు. ఏడు వాహనాలు కాలి బూడిదయ్యాయి. 21 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.

More Telugu News