currency: నోట్ల మీద 'మ‌హాత్మ‌' ప‌దాన్ని తీసేయాల‌ని మ‌ద్రాసు హైకోర్టులో పిల్ దాఖ‌లు... రూ. 10వేలు జ‌రిమానా వేసిన కోర్టు

  • స‌మ‌యం వృథా చేసినందుకు జ‌రిమానా విధించిన మ‌ద్రాస్ హైకోర్టు
  • పిల్ వేసిన రీసెర్చ్ స్కాల‌ర్ ఎస్. మురుగ‌నాథం
  • రాజ్యాంగంలోని ప్ర‌క‌ర‌ణ 14, 18 విరుద్ధ‌మ‌ని పిల్‌లో పేర్కొన్న మురుగ‌నాథం

భార‌త క‌రెన్సీ నోట్ల మీద గాంధీ పేరుకు ముందు 'మ‌హాత్మ' అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని కోరుతూ రీసెర్చ్ స్కాల‌ర్ ఎస్‌. మురుగ‌నాథం మ‌ద్రాస్ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశాడు. ఈ పిల్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు దానిని కొట్టివేసింది. అంతేకాకుండా కోర్టు విలువైన స‌మ‌యాన్ని వృథా చేసినందుకు గాను పిటిష‌న్‌దారుడిపైన రూ. 10 వేలు జ‌రిమానా కూడా విధించింది.

గాంధీ పేరుకు ముందు 'మ‌హాత్మ' అని ఉప‌యోగించ‌డం రాజ్యాంగంలోని ప్ర‌క‌ర‌ణ 14, 18ల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఎస్‌. మురుగ‌నాథం తన పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. అయితే 'మ‌హాత్మ' అనే బిరుదు ఏదైనా రాష్ట్రం గానీ, దేశం గానీ ఇవ్వ‌లేద‌ని, ఆ బిరుదును ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ ఇచ్చింది కావ‌డం వ‌ల్ల రాజ్యాంగానికి విరుద్ధంకాద‌ని కోర్టు వెల్ల‌డించింది.

More Telugu News