Karnataka: అసెంబ్లీకి డుమ్మా.. అమ్మాయిలతో స్టెప్పులేసిన సినీ హీరో అంబరీష్.. విమర్శల వెల్లువ!

  • 'ఉప్పు హుళి ఖార' టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అంబరీష్
  • యాంకర్ సుమశ్రీ కోరిక మేరకు మాలాశ్రీతో కలిసి డాన్స్ చేసిన అంబరీష్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. నెటిజన్ల విమర్శలు

కర్ణాటక అసెంబ్లీ ఓపక్క డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై అట్టుడుకుతోంది. ఈ కేసులో సీబీఐ ఏ1 నిందితుడిగా పేర్కొన్న మంత్రి కేజే జార్జి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీకి హాజరుకాని సినీ నటుడు అంబరీష్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి సినిమా టీజర్ విడుదల వేడుకలో డాన్స్ లు చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

 బెంగళూరులో జరిగిన 'ఉప్పు హుళి ఖార' సినిమా టీజర్ విడుదల వేడుకలో అంబరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అనుశ్రీ కోరిక మేరకు సినీ నటి మాలాశ్రీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News