shivaji raja: ఒక పెద్ద హీరో నాకు ఫోన్ చేసి మరీ నీతులు చెప్పాడు: శివాజీరాజా

  • మా అమ్మానాన్నలకు ఒక ఆర్టిస్ట్ లేనిపోనివి చెప్పాడు 
  • ఆ మాటలు నిజమని వాళ్లు నమ్మేశారు 
  • కొంతమంది శ్రీకాంత్ ను ఆరాతీశారు 
  • ఆ సమయంలో నన్ను ఆ ఇద్దరే సపోర్ట్ చేశారు

తాజాగా ఐ డ్రీమ్స్ తో శివాజీరాజా మాట్లాడుతూ .. తన జీవితంలో మరిచిపోలేని మరో సంఘటనను గురించి ప్రస్తావించారు. " మా మదరూ ఫాదర్ ఇద్దరూ కూడా మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవడం లేదని టీవీలకెక్కారు. నాకు ఎదురైన ప్రమాదాల్లో ఇది అన్నిటికంటే పెద్దదని నా అభిప్రాయం. " మీ అబ్బాయికి 100 ల కోట్ల ఆస్తి వుంది .. మీరేంటి ఇంకా 'పెంట్ హౌస్' లో వుంటారు" అని నా తోటి ఆర్టిస్ట్ మా పేరెంట్స్ కి లేనిపోనివి చెప్పాడు. వాళ్ల బుర్రలోకి విషం ఎక్కించడంతో ఆ క్షణంలో వాళ్లు ఆ మాటలు నమ్మేశారు" అని అన్నారు.

"నేనేంటో తెలిసిన కొంతమంది కూడా ఈ విషయంలో వాళ్ల నిజస్వరూపాన్ని చూపించారు. శ్రీకాంత్ కి ఫోన్ చేసి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఒక పెద్ద హీరో అయితే నాకు ఫోన్ చేసి .. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనే విషయంలో నీతులు చెప్పేశాడు. ఆ సమయంలో నన్ను సపోర్ట్ చేస్తూ ఇద్దరంటే ఇద్దరే ఫోన్ చేశారు. "అన్నా నువ్వెలాంటి వాడివో మాకు తెలుసు .. నువ్ బంగారానివి" అన్నారు. "ఆ ఇద్దరూ ఎవరో కాదు .. పోసాని కృష్ణమురళి .. వేణుమాధవ్" అంటూ చెప్పుకొచ్చారు.         

More Telugu News