srinivas reddy: 'సర్వమంగళం' టైటిల్ ఇబ్బందిగా అనిపించింది .. అందుకే మార్చమని చెప్పాను : కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి

  • నా సినిమాకి 'సర్వమంగళం' అనే టైటిల్ పెట్టారు 
  • అది నాకు నెగెటివ్ గా అనిపించింది 
  • ఆ టైటిల్ గురించి అంతా ఎలా మాట్లాడుకుంటారో చెప్పాను  
  • అప్పుడు 'జయమ్ము నిశ్చయమ్మురా'గా మార్చాము

తెలుగు తెరపై సందడి చేస్తూ నాన్ స్టాప్ గా నవ్వులు పండించే నటులలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. తనదైన శైలిలో ఆయన హాస్యాన్ని పండిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశాన్ని బట్టి అప్పుడప్పుడు హీరోగా చేస్తూనే, కమెడియన్ గాను బిజీగా వున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా టైటిల్ వెనుక జరిగిన తతంగం గురించి ప్రస్తావించారు.

" నేను హీరోగా చేసిన సినిమాకి 'సర్వమంగళం' అనే టైటిల్ పెడితే .. కొంతమంది అదోలా మాట్లాడారు. ఒక డిస్ట్రిబ్యూటర్ మరో డిస్ట్రిబ్యూటర్ కి ఫోన్ చేసి ఏ సినిమాను కొన్నారని అడిగితే .. 'సర్వమంగళం' అంటాడు .. ఇక సర్వమంగళమే అని అవతలాయన అంటాడు. అందుకే టైటిల్ మార్చమని దర్శకుడికి సూచించాను.

పోస్టర్ పై చూడటానికి .. సినిమా టైటిల్ చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పాను. ఆయనకి కూడా అది సబబుగానే అనిపించడంతో, ఇద్దరం కలిసి 'జయమ్ము నిశ్చయమ్మురా' టైటిల్ ను ఫైనల్ చేశాం. రిపీట్ టైటిల్ అయినా, కథకి కరెక్ట్ గా సరిపోతుందని అలా మార్చాం. అనుకున్నట్టుగానే ఆ సినిమాకి టైటిల్ మంచి హెల్ప్ అయింది" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News