google play store: గూగుల్ ప్లే స్టోర్‌లో క‌నిపించ‌ని యూసీ బ్రౌజ‌ర్ యాప్‌... త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని డిలీట్ చేసిన ఆండ్రాయిడ్‌!

  • 30 రోజుల పాటు నిషేధం విధించిన ఆండ్రాయిడ్‌
  • ఇన్‌స్టాల్స్ సంఖ్య‌ను పెంచ‌డం కోసం త‌ప్పుదారులు ఎంచుకుంటోంద‌ని ఆరోప‌ణ‌
  • స్ప‌ష్టం చేసిన యూసీ బ్రౌజ‌ర్ ఉద్యోగి

ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియ‌న్ల మందికి పైగా ఉప‌యోగిస్తున్న మొబైల్ ఇంట‌ర్నెట్ స‌ర్ఫింగ్ అప్లికేష‌న్ యూసీ బ్రౌజ‌ర్, గూగుల్ ప్లే స్టోర్‌లో క‌నిపించ‌డం లేదు. ఇన్‌స్టాల్ చేసుకోవ‌డానికి `యూసీ బ్రౌజ‌ర్‌` అని సెర్చ్ చేస్తే కేవ‌లం యూసీ మినీ యాప్ మాత్ర‌మే క‌నిపిస్తుంది. దీనికి గ‌ల కార‌ణాల‌ను ఆండ్రాయిడ్ సెంట్ర‌ల్ అనే టెక్నిక‌ల్ మేగ‌జైన్ వెల్ల‌డించింది.

ఇన్‌స్టాల్స్ సంఖ్య‌ను పెంచ‌డం కోసం త‌ప్పుదారులు ఎంచుకుని, ఇష్టం వ‌చ్చిన‌ట్లు అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ల‌ను యూసీ బ్రౌజ‌ర్ ఇస్తుంద‌ని, ఇది ఆండ్రాయిడ్ పాల‌సీల‌కు విరుద్ధం కావ‌డంతో తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజ‌ర్ యాప్‌ను ఆండ్రాయిడ్ తొల‌గించింద‌ని మేగ‌జైన్లో పేర్కొన్నారు. ఈ విష‌యంపై యూసీ బ్రౌజ‌ర్ ఉద్యోగి ఒక‌రు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో స్పందించాడు. యూసీ బ్రౌజ‌ర్‌ను ప్లేస్టోర్ నుంచి 30 రోజుల పాటు తొల‌గిస్తున్న‌ట్లు త‌న‌కు ఈ మెయిల్ వ‌చ్చిన‌ట్లు ఆ ఉద్యోగి స్ప‌ష్టం చేశాడు.

More Telugu News