jignesh: హార్దిక్‌ పటేల్‌ సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. శృంగారమనేది ప్రాథమిక హక్కు: ద‌ళిత నేత‌ జిగ్నేశ్

  • హార్దిక్‌ పటేల్‌పై వీడియో వైరల్ 
  • హార్దిక్ కు బాసటగా నిలిచిన గుజ‌రాత్ ద‌ళిత నేత‌
  • వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవ్వ‌రికీ లేదని వ్యాఖ్య‌

పటేల్ సామాజిక‌ వ‌ర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతోన్న‌ హార్దిక్‌ పటేల్‌ ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియో ఒకటి క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన హార్దిక్ ప‌టేల్, ఆ వీడియోలో ఉన్న‌ది తాను కాద‌ని చెప్పారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంద‌రు కావాల‌నే ఇటువంటి కుట్రపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

ఈ క్రమంలో, గుజరాత్‌ దళిత నేత జిగ్నేశ్‌ మెవాని హార్దిక్‌కు మద్దతుగా నిలిచి కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదని, శృంగారమనేది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించారు. అస‌లు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవ్వ‌రికీ లేదని, హార్దిక్ పటేల్ ఈ విష‌యంలో బాధ‌ప‌డవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.  

More Telugu News