iphone x: వెయ్యి అడుగుల ఎత్తు నుంచి ఐఫోన్ టెన్‌ని ప‌డేస్తే ఏమవుతుంది?..... వీడియో చూడండి!

  • ప్యానెల్ పాడవ‌డం మిన‌హా ప‌నితీరులో మార్పు రాలేదు
  • వీడియో పోస్ట్ చేసిన అన్‌లాక్ రివ‌ర్ వెబ్‌సైట్‌
  • స్మార్ట్‌ఫోన్ల దృఢ‌త్వాన్ని ప‌రీక్షించే వెబ్‌సైట్‌

ఇటీవ‌ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఐఫోన్ టెన్‌ని వెయ్యి అడుగుల ఎత్తు నుంచి ప‌డేస్తే ఏమ‌వుతుందో తెలుసా .... అస‌లు బోలెడు డ‌బ్బు పోసి కొన్న ఐఫోన్ టెన్‌ని ఎవ‌డైనా ప‌డేస్తాడా? అని మీరు అనుకోవ‌చ్చు. కానీ అన్‌లాక్ రివ‌ర్ వెబ్‌సైట్‌కి చెందిన క్రిష్టియ‌న్ ఫ్లోర్ మాత్రం అలాగే ప‌డేస్తాడు. కేవ‌లం ఐఫోన్ టెన్ అని మాత్రమే కాదు, మార్కెట్‌లోకి విడుద‌లైన కొత్త మోడ‌ల్ ఫోన్ల‌న్నింటినీ డ్రోన్ల సాయంతో ఆకాశం నుంచి ప‌డేసి వాటి దృఢ‌త్వాన్ని ప‌రిశీలిస్తాడు. ఆ వీడియోల‌ను తమ యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్ట్ చేస్తాడు.

అందులో భాగంగానే ఇటీవ‌ల ఐఫోన్ టెన్‌ని కూడా వెయ్యి అడుగుల ఎత్తు నుంచి ప‌డేసి, ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అప్పుడే బాక్సులో నుంచి తీసిన ఐఫోన్ టెన్‌ను డ్రోన్ సాయంతో వెయ్యి అడుగుల ఎత్తు వ‌ర‌కు పంపి వ‌దిలేయ‌డం, అది కింద ప‌డిన త‌ర్వాత కూడా కొద్దిపాటి ప్యానెల్ డ్యామేజ్ మిన‌హా ప‌నితీరులో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డం వీడియోలో చూడొచ్చు.

More Telugu News