sivagami: త్వరలో 'శివగామి' వెబ్ సిరీస్‌?

  • రూ. 10 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మాణం
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న దేవా క‌ట్టా
  • శివ‌గామి పాత్రలో మ‌రో న‌టి?

'బాహుబ‌లి' చిత్రాలు భార‌త చిత్ర ప‌రిశ్ర‌మలో ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. అందులోని ప్ర‌తి ఒక్క పాత్ర ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. వాటిలో ర‌మ్య‌కృష్ణ పోషించిన శివ‌గామి పాత్ర ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. అందుకే ఆ పాత్ర కేంద్రంగా త్వ‌ర‌లో వెబ్‌సిరీస్‌ను నిర్మించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

రూ. 10 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వనున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్థానం, వెన్నెల‌, ఆటోన‌గ‌ర్ సూర్య వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేవా క‌ట్టా ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్‌సిరీస్‌లో శివ‌గామి పాత్ర‌ను ర‌మ్య‌కృష్ణ పోషిస్తారా? లేక మ‌రెవ‌రైనా న‌టి పోషిస్తుందా? అనే విష‌యంపై కొంత సందిగ్ధ‌త ఉంది. ఈ విష‌యంపై స్ప‌ష్టత రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే!

More Telugu News