మరో ఆఫర్‌తో ముందుకు వచ్చిన వొడాఫోన్!

- రూ.458, రూ.509 రీఛార్జ్ లతో రెండు కొత్త ప్లాన్లు
- ఇరు ప్లాన్లపై అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ప్రతిరోజు 1 జీబీ డేటా
- రూ.458 ప్లాన్ వాలిడిటీ 70 రోజులు
- రూ.509 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు
ఇటువంటి ఆఫర్లే ఇతర టెలికాం కంపెనీలు కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే. మార్కెట్లో రిలయన్స్ జియో అందిస్తోన్న ఆఫర్ల జోరుతో తమ వినియోగదారులు జారి పోకుండా ఉండేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అచ్చం అలాంటి ఆఫర్లనే అందిస్తున్నాయి.