akhil: రేపు సర్ ప్రైజ్ చేస్తానంటోన్న అఖిల్!

  • అఖిల్ తాజా చిత్రంగా 'హలో'
  • దాదాపు 42 కోట్ల బడ్జెట్
  • రేపు టీజర్ రిలీజ్ చేయవచ్చనే టాక్ 
  • క్రిస్మస్ కానుకగా వచ్చేనెల 22న సినిమా విడుదల         

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా 'హలో' సినిమా రూపొందుతోంది. క్రిస్మస్ సందర్భంగా వచ్చేనెల 22వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి రేపు ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు తాజాగా అఖిల్ ట్వీట్ చేశాడు. దాంతో రేపు ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా టీజర్ కి నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చాడనే వార్త ఆల్రెడీ బయటికి వచ్చేసింది. ఆ టీజర్ ను రేపు వదలనున్నారని అఖిల్ మాటల వలన అర్థమవుతోంది. నాగార్జున ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాదాపు 42 కోట్ల వరకూ ఖర్చు చేయడం వలన, ప్రతి విషయంలోను నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. టీజర్ తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగేలా ఆయన ప్లాన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాతో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.        

More Telugu News