kiran bedi: కిరణ్ బేడీకి షాక్ ఇచ్చిన పుదుచ్చేరి అసెంబ్లీ సెక్రటరీ

  • ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన బేడీ
  • తప్పుబట్టిన అసెంబ్లీ కార్యదర్శి
  • అప్పట్లోనే బేడీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, డీఎంకే


పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి నారాయణస్వామిల మధ్య వివాదం మరింత ముదిరింది. వివరాల్లోకి వెళ్తే, 2017 జూలై 4వ తేదీన ముగ్గురు బీజేపీ నేతలను ఎమ్మెల్యేలుగా కేంద్రం నామినేట్ చేసింది. ఆ సందర్భంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని కనీసం ప్రభుత్వానికి కూడా తెలియజేయలేదు. అంతేకాదు, ఇతర శాసనసభ్యులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఈ ఘటనతో కిరణ్ బేడీకి, ప్రభుత్వానికి ఉన్న అగాధాన్ని మరింత పెంచింది.

ఈ నేపథ్యంలో, వీరి ముగ్గురి నామినేషన్లు చెల్లవంటూ అసెంబ్లీ కార్యదర్శి విన్సెంట్ రాయర్ ప్రకటించారు. ముగ్గుర నామినేషన్లకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కిరణ్ బేడీ సెక్రటరీకి విన్సెంట్ తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయంతో కిరణ్ బేడీకి షాక్ తలిగినట్టైంది. అప్పట్లోనే కిరణ్ బీడీ నిర్ణయాన్ని కాంగ్రెస్, డీఎంకేలు తప్పుబట్టాయి. 

More Telugu News