venkatesh: తేజ సినిమాలో ప్రొఫెసర్ గా కనిపించనున్న వెంకటేశ్

  • వెంకీతో తేజ తాజా చిత్రం 
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న వెంకీ 
  • కథానాయికగా నిత్యామీనన్?
  • వెంకీ బర్త్ డేకి సెట్స్ పైకి          

'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ కొట్టిన తేజ .. తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. వెంకటేశ్ తో ఆయన నెక్స్ట్ మూవీ ఉండనుంది. ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ పాత్ర ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో వెంకటేశ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడట.

డిఫరెంట్ లుక్ తో .. మేనరిజమ్స్ తో ఆయన ఈ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్రను ఎంతో విభిన్నంగా తేజ డిజైన్ చేశాడని అంటున్నారు. నటుడిగా వెంకటేశ్ లోని కొత్త కోణాన్ని ఆయన చూపించనున్నాడని చెబుతున్నారు. వెంకటేశ్ పుట్టినరోజైన డిసెంబర్ 13న ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి గాను ముందుగా తమన్నా .. అనుష్క .. కాజల్ పేర్లు వినిపించాయి. తాజాగా నిత్యామీనన్ పేరు వినిపిస్తోంది. ఎవరు ఖరారు అవుతారో చూడాలి మరి.       

More Telugu News