KTR: మెట్రోరైలును మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌

  • మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ తొలిద‌శ సేవ‌లు
  • మా స‌ర్కారు రూ.3 వేల కోట్లు కేటాయించింది
  • ఇప్ప‌టివ‌ర‌కు 2,240 కోట్లు ఖర్చు చేసింది
  • మొద‌టి ద‌శ‌లోనే ఏకంగా 30 కిలోమీట‌ర్లు మెట్రోరైలు ప‌రుగులు 

మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు అసెంబ్లీలో ప్ర‌సంగించారు. మొద‌టి ద‌శ‌లోనే ఏకంగా 30 కిలోమీట‌ర్లు ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఆ ప్రాజెక్టు కోసం త‌మ స‌ర్కారు రూ.3 వేల కోట్లు కేటాయించిందని, ఇప్ప‌టివ‌ర‌కు 2,240 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుంద‌ని తెలిపారు.

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని కేటీఆర్ చెప్పారు. ఈ నెల‌ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా తొలిద‌శ మెట్రోరైలు సేవ‌ల‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

More Telugu News