Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మిలియన్ ఫాలోవర్ల క్లబ్బులో కీర్తి 
  • హీరోగా మారుతున్న యాంకర్ ప్రదీప్ 
  • సూర్య చిత్రంలో నటిస్తున్న రకుల్ 
  • అఖిల్ సినిమాకు నాగార్జున వాయిస్ ఓవర్

*  సోషల్ మీడియాలో సినీ తారలకు వుండే ఫాలోయింగే వేరు. తాజాగా అందాలతార కీర్తి సురేష్ కూడా ట్విట్టర్లో మంచి ఆదరణ చూరగొంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది. కాగా, ఆమె ఫేస్ బుక్ ఖాతాకు ఇప్పటికే 5 మిలియన్ ఫాలోవర్లు వున్నారు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఆనందంతో అందరికీ థాంక్స్ చెప్పింది.
*  అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారుతున్నాడు. కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మనికంఠన్ దర్శకత్వం వహించే చిత్రంలో ప్రదీప్ హీరోగా నటించనున్నట్టు సమాచారం.
*  తమిళంలో కూడా స్పీడు పెంచిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సూర్య సరసన నటించనుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్టు రకుల్ తాజాగా ధ్రువీకరించింది.
*  అఖిల్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా 'హలో' చిత్రం టీజర్ త్వరలో విడుదల కానుంది. దీనికి అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ చెబుతున్నారట. విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణి కథానాయికగా నటిస్తోంది. వచ్చే నెల 22న ఈ చిత్రం రిలీజవుతుంది.          

More Telugu News