Vijayawada: ప్రైవేటు బోటు ఎక్కాం.. లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వలేదు: బాధితులు

  • సమయం అయిపోవడంతో ప్రయాణికులను ఎక్కించుకోని ఏపీ టూరిజం బోటు
  • ప్రమాదానికి ముందే మూడు సార్లు కుదుపులు
  • ఇంతలోనే ప్రమాదం

విజయవాడలో చోటు చేసుకున్న ఘోర బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తుల ద్వారా కొంత సమాచారం వెల్లడైంది. వీరంతా ఒంగోలు వాకర్స్ క్లబ్ తరపున వచ్చారు. 38 మంది ఉన్నారు. భవానీ ఐలాండ్స్ వద్ద, అప్పటికే సమయం అయిపోవడంతో ఏపీ టూరిజం బోటు సిబ్బంది వారిని ఎక్కించుకునేందుకు నిరాకరించారు.

దీంతో, వీరు ప్రైవేటు బోటులో ఎక్కారు. ఈ సందర్భంగా లైఫ్ జాకెట్లు కావాలని బాధితులు బోటు సిబ్బందిని అడిగారు. కానీ బోటు సిబ్బంది లైఫ్ జాకెట్లను ఇవ్వలేదు. ప్రమాదానికి ముందే రెండు, మూడు సార్లు కుదుపులు వచ్చాయని ఓ బాధితుడు తెలిపారు. ఆ తర్వాత బోటు బోల్తా పడిందని చెప్పారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదానికి ప్రైవేటు బోటు యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అర్థమవుతోంది. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లను అందించి ఉంటే, అందరూ ప్రాణాలతో బయటపడేవారు.

More Telugu News