Russia: ఐఎస్ఐఎస్ ను తుదముట్టించేందుకు అమెరికాతో చేతులు కలిపిన రష్యా

  • ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై సంయుక్తదాడులకు సిద్ధమవుతున్న అమెరికా, రష్యా
  • వియత్నాంలోని ఎపెక్ సదస్సుకు హాజరైన సందర్భంగా చర్చలు
  • సెర్గీ లవ్ రోవ్, రెక్స్ టిల్లర్ సన్ అంగీకరానికి వచ్చినట్టు ప్రకటన

సిరియాలో అరాచకానికి కారణమవుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థను నిర్మూలించేందుకు అమెరికా, రష్యాలు చేతులు కలిపాయి. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో.. వియత్నాంలోని దనంగ్‌ లో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకానామిక్ కో ఆపరేషన్ (ఏపీఈసీ) సమావేశంలో పాల్గొన్న రష్యా విదేశాంగశాఖా మంత్రి సెర్గీ లవ్‌ రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌ సన్ మధ్య చర్చల అనంతరం ఈ అంగీకారానికి వచ్చినట్టు తెలిపింది.

సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ ను అంతం చేసి సుస్థిరపాలన కోసం రాజకీయపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు దేశాలు నిర్ణయించినట్టు తెలిపాయి. కాగా, సిరియాలో ఇంతవరకు ఈ రెండు దేశాలు వేర్వేరుగా ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News