university of pune: స్పాన్సర్లతో మాట్లాడి నిబంధన తొలగిస్తాం.. లేకుంటే గోల్డ్ మెడల్ రద్దు చేస్తాం.. దిగివచ్చిన పూణే యూనివర్సిటీ!

  • వెజిటేరియన్లు, మద్యం సేవించని వారికే గోల్డ్ మెడల్ అంటూ నిబంధన 
  • విమర్శలు వెల్లువెత్తడంతో దిగివచ్చిన వర్శిటీ 
  • స్పాన్సర్లతో మాట్లాడి ఒప్పిస్తామని, లేని పక్షంలో గోల్డ్ మెడల్ రద్దు చేస్తామని ప్రకటన

సావిత్రీభాయ్ పూలే పూణే యూనివర్సిటీ దిగివచ్చింది. 'మహారిషి కీర్తంకర్ శేలార్ మామ' పేరిట గోల్డ్ మెడల్ పొందే విద్యార్థులు వెజిటేరియన్లు, మద్యం సేవించని వారై ఉండాలని, అలాంటి విద్యార్థులకు మాత్రమే గోల్డ్‌ మెడల్‌ ఇస్తామని విధించిన నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో యూనివర్సిటీ ఆ నిబంధనను తీసివేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ గోల్డ్ మెడల్ కు శెలార్ కుటుంబ సభ్యులు స్పాన్సర్లుగా ఉన్నారని, దీనిపై వారితో చర్చిస్తామని తెలిపారు. స్పాన్సర్లు ఈ నిబంధన ఉండాల్సిందేనని పట్టుబడితే మాత్రం ఈ గోల్డ్ మెడల్ ను రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. 

More Telugu News