kim jong un: ట్రంప్ యుద్ధాన్ని అడుక్కుంటున్నారు: కిమ్ జాంగ్ ఉన్ ఎద్దేవా

  • ట్రంప్ ఆసియా పర్యటన సందర్భంగా ప్రకటన విడుదల చేసిన కిమ్ జాంగ్ ఉన్
  • అణ్వాయుధ తయారీ ఆపేది లేదన్న నియంత 
  • ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా శక్తులను కూడగడుతున్నారు
  • కొరియన్ ద్వీపకల్పంలో ట్రంప్ యుద్ధాన్నికోరుకుంటున్నారు

అణ్వాయుధ తయారీ, పరీక్షలతో ప్రపంచాన్ని ఆందోళనలోకి నెడుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌‌‌ ను భయపెట్టి అణ్వాయుధాల అభివృద్ధిని నియంత్రించే ఉద్దేశంతో ఆసియా పర్యటనకు వచ్చిన ట్రంప్ పై కిమ్ ధ్వజమెత్తాడు. ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని కిమ్ ఎద్దేవా చేశారు. అంతే కాకుండా ట్రంప్ తమను ఎన్నటికీ భయపెట్టలేరని, అలాగే తమ దేశంలో అణ్వాయుధాల అభివృద్ధిని నిరోధించలేరని స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. ఇకపై అణ్వాయుధాల అభివృద్ధి వేగాన్ని పెంచుతామని ఆయన పేర్కొన్నారు.

 ట్రంప్ ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా శక్తులను కూడగతున్నారని ఆయన మండిపడ్డారు. ట్రంప్ విధ్వంసకుడని మండిపడ్డారు. ట్రంప్ కొరియన్ ద్వీపకల్పంలో యుద్ధాన్ని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తాజా ప్రకటనతో కిమ్ ను భయపెట్టి దారిలోకి తీసుకురావచ్చని భావించిన అమెరికా ఆశలు నీరుగారినట్టేనని భావించవచ్చు. పైగా ట్రంప్ ను రెచ్చగొడుతూ ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేయడం ద్వారా ఉద్రిక్తతను మరింత పెంచారు. అంతే కాకుండా అణ్వాయుధ తయారీ ఆపేది లేదని స్పష్టంగా ప్రకటించి దేనికైనా రె'ఢీ' అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

More Telugu News