Donald Trump: రష్యా జోక్యం చేసుకోలేదని పుతిన్ నాతో చెప్పారు: ట్రంప్

  • ఆసియా పర్యటనలో భాగంగా వియత్నాం చేరుకున్న ట్రంప్
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అక్కడే 
  • వియత్నాంలో ట్రంప్, పుతిన్ భేటి
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారా? అని పుతిన్ ను అడిగానన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి తన గెలుపులో రష్యా జోక్యం ఉందంటూ ఆరోపణలు రావడం.. అందులో వాస్తవం లేదని డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇస్తూనే వుండడం మనం చూస్తూనే వున్నాం. అయినా స్వదేశంలో ఆయన వాదనను పట్టించుకున్నవారే లేరు. దీనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ వియత్నాంలో ఎపెక్ సదస్సు కోసం వెళ్లి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలుసుకున్నారు.

ఈ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీరు జోక్యం చేసుకున్నారా? అని పలుమార్లు పుతిన్ ను అడిగినట్టు ట్రంప్ తెలిపారు. అయితే ఆయన లేదనే చెప్పారని అన్నారు. అంతే కాకుండా మీరు ఎన్నిసార్లైనా అడగండి, ఆయన లేదనే చెబుతారని అన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రష్యన్‌ హ్యాకర్లు సామాజిక మాధ్యమాలను హ్యాక్‌ చేసి ట్రంప్‌ కు మద్దతుగా ప్రచారం చేశారని, రష్యా వల్లే ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News