nd tiwari: ఎన్డీ తివారీ ఆరోగ్య పరిస్థితి విషమం!

  • సెప్టెంబర్ 20న బ్రెయిన్ స్ట్రోక్
  • ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం
  • అక్టోబర్ 26న పక్షవాతం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన వయసు 92 ఏళ్లు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను రెండు నెలల క్రితం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు. చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వైద్యులు తెలిపారు.

సెప్టెంబర్ 20న ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో, ఆయనను ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య బృందం ఆయనను 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 12న ఆయనను ఐసీయూలోకి తరలించారు. ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగు కావడంతో ఆయనను మళ్లీ జనరల్ వార్డుకు తరలించారు. అయితే, ఆ నెల 26న మళ్లీ ఆయన పరిస్థితి విషమించింది. అంతేకాదు, ఆయనకు పక్షవాతం కూడా వచ్చింది. ఈ విషయాలను వైద్యులు తెలిపారు.

More Telugu News