love: కాస్ట్ లీ ప్రేమ.. ప్రియురాలికి పాతిక ఫోన్లు బహూకరిస్తూ ప్రపోజ్ చేశాడు!

  • ప్రియురాలికి 25 'ఐ ఫోన్ 10' ఫోన్లను గిఫ్ట్ చేసిన ప్రియుడు
  • ఆ కాస్ట్ లీ ప్రపోజల్ కి ప్రియురాలు ఫిదా.. గ్రీన్ సిగ్నల్ 
  • తన ప్రేమ పెళ్లికి సహకరించిన స్నేహితులకు కూడా ఐ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించిన షెన్ జెన్
  • ఒక్కో ఫోన్ ఖరీదు లక్ష రూపాయల పైమాటే

ప్రేమ ముందు డబ్బు ఒక లెక్కా? అన్నట్టు చైనాకు చెందిన యువకుడు ప్రియురాలి అంగీకారం కోసం లక్షలు ధారపోశాడు. గేమ్ డిజైనర్ షెన్ జెన్ అనే యువకుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించేందుకు ఏకంగా 25 'ఐ ఫోన్ 10'లను బహూకరించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 25.5 లక్షల రూపాయల విలువ చేసే ఈ ఫోన్లను ప్రేమ చిహ్నమైన గుండె ఆకారంలో తయారు చేసిన ఓ బాక్సులో పెట్టి, వాటి మధ్యలో ఎరుపు గులాబీలు ఉంచి, మధ్యలో నిశ్చితార్థం ఉంగరం ఉంచాడు.

తనపై కురిపించిన ప్రియుడి ప్రేమకు ఆ అమ్మాయి ఫిదా అయిపోయింది. వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో తన స్నేహితుల సమక్షంలోనే ప్రియురాలిపై ముద్దుల వర్షం కురిపించాడు. అన్నట్టు, ప్రియురాలు తనతో వివాహానికి అంగీకరించేలా చేయడంలో సహకరించిన స్నేహితులకు కూడా ఈ తరహా ఐఫోన్లను కానుకగా ఇవ్వాలని షెన్ జెన్ నిర్ణయించడం మరో విశేషం.

More Telugu News