kota sreenivasa rao: హాస్పిటల్ కు వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా?: కోట శ్రీనివాసరావు

  • ఆసుపత్రికి వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా?
  • తెలిసిన వారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి కూడా వెళ్లకూడదా?
  • ఈ వయసులో కంటి నొప్పో, కాళ్ల నొప్పులో రావడం సహజమే

నిజనిజాలు తెలుసుకోకుండా తన ఆరోగ్యం గురించి అబద్ధపు ప్రచారాలు చేయవద్దని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు వేడుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఊపిరితిత్తులు పాడయ్యాయని కోట గురించి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విన్నపాన్ని తెలియజేశారు. తాను చాలా మొండివాడినని, తన గురించి ఎవరైనా, ఏమైనా అంటే తట్టుకోగలనని... అయితే తన బంధువులను, అభిమానులను ఇబ్బంది పెట్టే హక్కు మాత్రం ఎవరికీ లేదని తెలిపారు.

తన వయసు 74 ఏళ్లని, ఈ వయసులో కంటి నొప్పో, కాళ్ల నొప్పులో రావడం సహజమేనని కోట చెప్పారు. తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి వెళ్లకుండా ఉంటానా? అని ప్రశ్నించారు. హాస్పిటల్ కు వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా? అని అన్నారు. ఇలాంటి ప్రచారాలు కేవలం తన విషయంలో మాత్రమే జరగలేదని... సీనియర్ గాయని సుశీల గారి విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వారు చాలా సున్నితంగా ఉంటారని... ఇలాంటి వార్తలతో వారి కుటుంబీకులు చాలా ఆందోళనకు గురవుతారని చెప్పారు.

More Telugu News