saudi arabia: లెబనాన్ లో ఉండొద్దు... వెంటనే ఆ దేశం విడిచి వచ్చేయండి!: సౌదీ అరేబియా ప్రకటన

  • లెబనాన్ లో తమ పౌరులెవరూ ఉండొద్దన్న సౌదీ అరేబియా
  • ప్రాంతీయ అసమానతలతో ఏ క్షణమైనా సున్నీలు, షియాల మధ్య ఘర్షణలు చెలరేగే అవకాశం
  • ఇరాన్ తో కలిసి లెబనాన్ కుట్రలు చేస్తోందన్న సౌదీ 

లెబనాన్‌ లో తమ పౌరులు ఉండొద్దని, వెంటనే ఆ దేశం వదిలి స్వదేశానికి చేరుకోవాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటన చేసింది. లెబనాన్ లో ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సౌదీ ప్రభుత్వం ఏ క్షణంలో అయినా సున్నీ, షియా వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతే కాకుండా ఇరాన్ తో చేతులు కలిపిన లెబనాన్.. సౌదీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని సౌదీ విదేశాంగ మంత్రి అబెల్ అల్ జుబిర్ ఆరోపించారు. అందుకే తాము లెబనాన్‌ ను శత్రు దేశంగా పరిగణిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇరాన్‌ తో కలిసి లెబనాన్ తమపై దాడి చేసే అవకాశం కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సాక్ష్యంగా ఇటీవల హైతీ తిరుగుబాటుదారులు సౌదీ ఎయిర్‌ పోర్టు లక్ష్యంగా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగించిన సంఘటనను ప్రస్తావిస్తూ, దీని వెనుక ఇరాన్ ఉందని ఆరోపించారు. సౌదీతో యుద్ధం చేయాలని లెబనాన్, ఇరాన్ లు నిర్ణయించుకున్నాయని, ఈ మేరకు ఇరాన్ తో లెబనాన్ ప్రధాని హెజ్భుల్లా ఇప్పటికే చర్చలు కూడా జరిపారని ఆయన తెలిపారు. అందుకే లెబనాన్ లో ఉన్న సౌదీ పౌరులు తక్షణం వెనక్కి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన వివరణ ఇచ్చారు. 

More Telugu News