Saudi Arabia: సౌదీని టార్గెట్ చేసిన ఇరాన్.. గతవారం రియాద్‌లో కూలిన క్షిపణిపై ఇరాన్ ‘మార్క్’

  • సౌదీ ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిన క్షిపణిపై ఇరాన్ గుర్తులు
  • దాడి తమ పనేనన్న హైతీ రెబల్స్
  • ఇరాన్‌ నుంచి క్షిపణి వారికెలా చేరిందో దర్యాప్తు ప్రారంభించిన అమెరికా

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుంటూ గత వారం వచ్చిన బాలిస్టిక్ మిసైల్ ఇరాన్‌కు చెందినదని అమెరికా వాయుసేన నిర్ధారించింది. ఆ క్షిపణిపై ఇరాన్‌కు చెందిన గుర్తులు ఉన్నట్టు తెలిపింది. ఈ క్షిపణిదాడికి ఇప్పటికే యెమన్‌కు చెందిన ఇరానియన్ల మద్దతు ఉన్న హైతీ రెబల్స్ బాధ్యత ప్రకటించారు. హైతీ రెబల్స్‌కు ఇరాన్ నేరుగా ఆయుధాలు సరఫరా చేస్తోందని సౌదీ రాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆరోపించిన తర్వాతి రోజే హైతీ రెబల్స్ ఈ ప్రకటన చేశారు.

గత శనివారం రియాద్ విమానాశ్రయానికి సమీపంలో క్షిపణిదాడి జరిగింది. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో ఈ దాడి వెనక ఇరాన్ హస్తం ఉందన్న విషయం బయటపడిందని నైరుతి ఆసియా అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జెఫ్రీ హరిగియన్ తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఈ క్షిపణిని యెమన్‌కు అక్రమంగా ఎలా తరలించారన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.

More Telugu News