Virat Kohli: సోష‌ల్ మీడియాలో స‌మ‌యం వృథా చేసుకోకండి: కోహ్లీ సందేశం

  • ఎవ‌ర‌యినా సోష‌ల్ మీడియాకు కొంత స‌మ‌యం మాత్ర‌మే ఇవ్వాలి
  • నేను కూడా ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియాకి అధిక స‌మ‌యం కేటాయించేవాడిని
  • పిల్ల‌లు వీడియో గేమ్స్‌కే ప‌రిమిత‌మై పోతున్నారు
  • మైదానాల్లో ఆడుకోవాలి

మైదానంలో త‌న బ్యాట్‌తో ప‌రుగుల వ‌ర‌ద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పుడ‌ప్పుడు యువ‌త‌తో మాట్లాడుతూ మంచి సందేశాలు కూడా ఇస్తుంటాడు. తాజాగా ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... సోష‌ల్ మీడియాలో స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌ద్ద‌ని, మైదానాల్లోకి వెళ్లి ఆడుకోండ‌ని చెప్పాడు. ఈ కాలంలో పిల్ల‌లు ఇంట్లో ఉండి వీడియో గేమ్స్ ఆడుకోవ‌డానికే ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తున్నార‌ని అన్నాడు.

అలాగే యువ‌త సోష‌ల్ మీడియాకి బానిస‌గా అయిపోతున్నార‌ని చెప్పాడు. త‌న సందేశం కేవ‌లం చిన్నారుల‌కు, యువ‌త‌కే కాద‌ని దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికీ అని చెప్పాడు. ఎవ‌ర‌యినా సోష‌ల్ మీడియాకు కొంత స‌మ‌యం మాత్ర‌మే ఇవ్వాల‌ని చెప్పాడు. తాను కూడా ఒకప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా స‌మ‌యం వృథా చేసేవాడిన‌ని ఆ త‌రువాత దానిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని తెలిపాడు.  

More Telugu News