sunitha: ఆ మాటలు విని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకునేదాన్ని!: సింగర్ సునీత

  • మానసికంగా చాలా దెబ్బతిన్నాను
  • ఏదీ శాశ్వతం కాదని అర్థమైపోయింది 
  • పరిస్థితుల నుంచి పారిపోలేను 
  • నాకు ఈ ఇండస్ట్రీ తప్ప మరేం తెలియదు  

జీవితంలో తనకి ఎదురైన కొన్ని సంఘటనల గురించిన విషయాలను ఐ డ్రీమ్స్ తో సింగర్ సునీత పంచుకున్నారు. "నిజంగా నేను చాలా కష్టతరమైన ప్రయాణం చేస్తున్నాను. నా మంచి కోరుకునే వాళ్లు .. నేను నిజంగా బాగుంటే చూడాలనుకునే వాళ్లు .. నా అభిమానుల బ్లెస్సింగ్స్ తోనే లైఫ్ ముందుకు వెళ్లిపోతోంది. లేకపోతే ఎక్కడ వుండే దానినో .. ఎలా వుండేదానినో" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

 "పెద్దగా కష్టాలు అనుభవించిందంటూ ఏమీ లేదు గానీ, మానసికంగా నేను చాలా దెబ్బతిన్నాను. ఇల్లు కూలిపోతే తేరుకుని మళ్లీ కట్టుకోవచ్చు .. కానీ మనసుకి దెబ్బ తగిలితే మాత్రం కోలుకోవడం చాలా కష్టం. పెట్టుకున్న నమ్మకాలు నిజం కాకపోవడం వల్లనే జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. ఇక 'ఇలా అట' .. 'అలా అట' అనుకునే వాళ్ల మాటలు విని విని, నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతే వీళ్లంతా చాలా హ్యాపీగా ఫీలవుతారేమోనని అనిపించేది. అలా అనుకున్న మరుక్షణం .. నా పరిస్థితులన్నీ నాకు గుర్తుకొచ్చేస్తాయ్. నాకు మరో పనేదీ తెలియదు .. ఏ రిసెప్షనిస్ట్ గా వెళ్లినా జాబ్ ఇస్తారు .. కానీ ఆ డబ్బుతో ఇల్లు గడపగలనా? .. లేదే .." అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 

More Telugu News