cell phone: ఫోన్ కొనగానే ఈ పని చేయండి.. మీ ఫోన్ సేఫ్!

  • ఎనిమిది గంటల పాటు ఛార్జింగ్ పెట్టాలి
  • అప్లికేషన్లు స్మూత్ గా ఇన్ స్టాల్ కావాలి
  • ఛార్జింగ్ మధ్యలోనే అయిపోతే.. రకరకాల సమస్యలు

మనం కొత్త ఫోన్ ను కొన్నప్పుడు మొబైల్ షాపులోని వ్యక్తి మనకు ఒక మాట కచ్చితంగా చెబుతాడు. తొలుత ఫోన్ ను ఫుల్ గా ఛార్జ్ చేయండి అని రికమెండ్ చేస్తాడు. వాడటానికి ముందు కనీసం ఎనిమిది గంటల పాటు ఛార్జింగ్ పెట్టాలని మొబైల్ కంపెనీలు కూడా పేర్కొంటాయి. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ స్పేర్ పార్ట్స్ వివిధ చోట్ల తయారవుతుంటాయి. బ్యాటరీ కూడా అంతే... ఎక్కడో తయారవుతుంది. ఇలా తయారైన బ్యాటరీ, మొబైల్ కంపెనీకి చేరుతుంది. అక్కడ అసెంబుల్ అయిన మొబైల్ తో పాటు, ప్యాక్ అవుతుంది. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ కు, అక్కడి నుంచి షోరూమ్ కు, అక్కడి నుంచి మన చేతిలోకి వస్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోయి ఉంటుంది.

మరోవైపు, కొత్త ఫోన్ ను ఆన్ చేయగానే ఫార్మ్ వేర్ వంటివి, ఫోన్లో ఉన్న అప్లికేషన్లకు అప్ డేట్స్ వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ స్మూత్ గా ఇన్ స్టాల్ కావాలంటే, ఫోన్ లో సరిపడా బ్యాటరీ పర్సెంటేజ్ ఉండాలి. మధ్యలోనే ఛార్జింగ్ అయిపోతే, రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందుకే కనీసం ఎనిమిది గంటలపాటు ఛార్జింగ్ పెట్టాలని ఫోన్ కంపెనీలు చెబుతుంటాయి.  

More Telugu News