zoo: టికెట్ లేకుండా జూలోకి వెళ్లాడు... పులులకు ఆహారమైపోయాడు!

  • టికెట్ లేకుండా జూలోకి వెళ్లాలని భావించిన చైనా యువకుడు
  • గోడెక్కి కిందికి దూకేయగా.. సరిగ్గా వెళ్లి పులుల ఎన్ క్లోజర్ లో పడ్డాడు 
  • మీద పడిన పులులతో పోరాడి చనిపోయిన యువకుడు
  • యువకుడ్ని కాపాడేందుకు పులులపై కాల్పులు జరిపిన జూ సిబ్బంది

పొరపాటున పులుల ఎన్ క్లోజర్ లోకి దూకిన యువకుడు వాటికి ఆహారమైపోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని షాంగైలోని జూలో పెద్దపులిని చూడడం కోసం స్నేహితుడితోపాటు వెళ్లిన ఓ యువకుడు క్రేజీగా ఏదైనా చెయ్యాలని భావించాడు. దీంతో టికెట్ లేకుండా జూలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గేట్ ద్వారా కాకుండా.. స్నేహితుడు వారిస్తున్నా వినకుండా టికెట్ కౌంటర్ కు కాస్త దూరంగా ఉన్న గోడపైకెక్కి అమాంతం లోపలి దూకేశాడు.

అతను దూకింది సరిగ్గా పులుల ఎన్ క్లోజర్ కావడంతో అక్కడే ఉన్న పులుల గుంపు ఒక్కసారిగా అతనిపై పడింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పులులతో పోరాటం ప్రారంభించాడు. జూలోని సందర్శకుల హాహాకారాలతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న సిబ్బంది అతనిని రక్షించేందుకు తుపాకితో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పులి చనిపోయింది. అయితే అప్పటికే ఆ యువకుడు కూడా మరణించడం జరిగింది. దీంతో మరో పులి వచ్చి అతనిని లాక్కెళ్లి తన పిల్లలకు ఆహారంగా వేసింది. దీనిని వీడియో తీసిన పర్యాటకులు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

More Telugu News