saudi arabia: గల్ఫ్ లో సంక్షోభం.. తమ పౌరులకు అత్యవసర ప్రకటన చేసిన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్

  • లెబనాన్ లో పరిస్థితులు బాగోలేవు
  • అక్కడుండటం క్షేమకరం కాదు
  • ఎవరూ ఆ దేశానికి వెళ్లవద్దు

తమ పౌరులను ఉద్దేశించి సౌదీ అరేబియా ప్రభుత్వం అత్యవసర ప్రకటన చేసింది. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం లెబనాన్ దేశానికి వెళ్లిన సౌదీ ప్రజలంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలంటూ తన ప్రకటనలో పేర్కొంది. లెబనాన్ లో పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉండటం క్షేమదాయకం కాదని తెలిపింది. అంతేకాదు, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్నవారు కూడా ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించింది.

సౌదీ బాటలోనే కువైట్ కూడా తన పౌరులకు అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. వెంటనే లెబనాన్ ను విడిచిపెట్టి వచ్చేయాలని, ఇక్కడున్న వారు ఎవరూ ఆ దేశానికి వెళ్లవద్దని సూచించింది. మరోవైపు, లెబనాన్ నుంచి వెంటనే వచ్చేయాలంటూ బహ్రెయిన్ తన దేశ పౌరులను కోరింది. లెబనాన్ లోని పాలన ఇరాన్ నియంత్రణలో ఉందని ఇటీవల సూడాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరీ వెల్లడించారు. అంతేకాదు, సౌదీ అరేబియాలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లోనే సౌదీ, కువైట్, బహ్రెయిన్ లు తాజా నిర్ణయానికి వచ్చాయి. 

More Telugu News