psv garudavega: విజయవాడ పీవీపీ కాలేజీలో రాజశేఖర్ కుమార్తెల సందడే సందడి!

  • ప్రస్తుతం 'గరుడవేగ' ప్రమోషన్ లో బిజీగా ఉన్న రాజశేఖర్
  • కుమార్తెలతో కలసి విజయవాడలో పర్యటన
  • శివానీ, శివాత్మికలను ఆహ్వానించి స్టెప్పులు

చాలా కాలానికి 'పీఎస్వీ గరుడవేగ' రూపంలో ఓ మంచి హిట్ కొట్టిన రాజశేఖర్, ఆ చిత్రాన్ని మరింతగా ప్రమోషన్ చేసుకోవడం కోసం పట్టణాలు చుట్టేస్తున్నారు. తాజాగా, తన కుమార్తెలు శివానీ, శివాత్మికలతో కలసి విజయవాడ పీవీపీ సిద్ధార్థ కళాశాలకు వెళ్లిన రాజశేఖర్, ఆ చిత్రంలో సన్నీలియోన్ నర్తించిన 'డియో డియో...' పాటకు స్టెప్పులేశారు. తొలుత పాటకు డ్యాన్స్ చేసిన రాజశేఖర్, ఆపై వెనకే కూర్చున్న తన కూతుళ్లనూ ఆహ్వానించాడు. వారితో కలసి స్టెప్పులేశాడు. ఈ సందర్భంగా శివానీ, శివాత్మికలు అక్కడి విద్యార్థులతో కలసి సరదాగా గడిపారు. సందడి చేశారు. రాజశేఖర్ డ్యాన్స్ వేసిన వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News