MS Dhoni: ధోనీ డాన్స్.. సిగ్గుపడిపోయిన సాక్షి... వీడియో చూడండి!

  • న్యూజిలాండ్ సిరీస్ తరువాత కుటుంబంతో ఆనందంగా గడుపుతున్న ధోనీ
  • బాలీవుడ్‌ సినిమా ‘దేశీ బాయ్స్‌’ లోని ‘ఝగ్‌ మార్‌ కే’ పాటకు ధోనీ డ్యాన్స్‌
  • సంతోషంగా ఎంజాయ్ చేసిన సాక్షి

టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, అతని కుమార్తె జివాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, విశేషాలను సోషల్ మీడియాలో ధోనీ భార్య పోస్టు చేస్తుంటుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్‌ లో వచ్చిన ‘దేశీ బాయ్స్‌’ సినిమాలోని ఓ పాటకు ధోనీ డ్యాన్స్‌ చేశాడు.

 కివీస్ తో సిరీస్ విజయం సాధించిన అనంతరం ఇంటికి వెళ్లిన ధోనీ కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా సాక్షితో ఉన్న సమయంలో ‘దేశీ బాయ్స్‌’లోని ‘ఝగ్‌ మార్‌ కే’ పాటకు స్టెప్పులేశాడు. ధోనీ స్టెప్పులను సాక్షి ఎంజాయ్‌ చేసింది. నవ్వుతూనే కొంచెం సిగ్గుపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 

More Telugu News