bittiri satti: 'వీ6'కు బిత్తిరి సత్తి రాజీనామా... రూ. 2 లక్షల జీతంతో టాప్ చానల్ లోకి!

  • 'వీ6' మేనేజ్ మెంట్ తో గొడవ
  • ఎవరినీ లెక్క చేయని బిత్తిరి సత్తి
  • రాజీనామా చేసి బయటకు
  • అవకాశాలు పెరగడంతోనే అంటున్న చానల్

తనదైన శైలిలో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, 'తీన్ మార్' ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియాస్ రవి, తాను మొదటి నుంచి పని చేస్తున్న 'వీ6' చానల్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. చానల్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు, సత్తికి పాప్యులారిటీ పెరుగుతూ ఉండటంతో, ప్రైవేటు కార్యక్రమాలు చేసుకోవడానికీ మేనేజ్ మెంట్ అనుమతిచ్చింది. సత్తి ప్రైవేటు షూటింగ్ లకు కూడా సంస్థ కెమెరాలను తీసుకువెళుతుంటే ఏమీ అనలేదు.

ఇక ఇటీవలి కాలంలో చాన్సులు పెరగడం, మరిన్ని ప్రోగ్రామ్ లకు అవకాశాలు రావడం, ఉదయభాను వంటి టాప్ యాంకర్ తో స్టేజ్ పంచుకునే అవకాశం లభించడంతో, సత్తిలోని మరో యాంగిల్ బయటకు వచ్చిందట. వీ6 టీమ్ ను ఎంతమాత్రమూ కేర్ చేయడం లేదని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని మేనేజ్ మెంట్ ప్రస్తావించగా, గొడవ పెట్టుకుని రాజీనామా చేశాడని సమాచారం. రూ. 2 లక్షల నెల వేతనంతో మరో ప్రముఖ చానల్ లో సత్తికి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. బిత్తిరి సత్తి చానల్ మారడంపై ప్రత్యేక కథానాన్ని చూడండి.

More Telugu News