Chiranjeevi: చిరంజీవి ఇంట చోరీ చేసింది ఇతనే... మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు!

  • చిరు ఇంట్లో రూ. 2 లక్షలు దోచుకెళ్లిన చెన్నయ్య
  • అరెస్ట్ చేసిన తరువాత రూ. 1.50 లక్షలు రికవరీ
  • మిగతా సొమ్ముతో జల్సాలు చేసిన చెన్నయ్య

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్ 25లోని చిరంజీవి ఇంట్లో చెన్నయ్య అనే వ్యక్తి గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆయన ఇంటి ఆవరణలో ఉండే అడ్మినిస్ట్రేట్ ఆఫీసులో విధులు నిర్వహిస్తుంటాడు.

ఇటీవల ఆఫీసు ఖర్చుల నిమిత్తం మేనేజర్ గంగాధర్ రావు రూ. 4 లక్షలు తెచ్చి టేబుల్ సొరుగులో ఉంచి, సాయంత్రం చూడగా, రూ. 2 లక్షలు మాయం అయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు చెన్నయ్యను అరెస్ట్ చేసి, అతన్నుంచి రూ. 1.50 లక్షలు రికవరీ చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఆపై రిమాండ్ కు తరలించారు. మిగతా రూ. 50 వేలతో అతను జల్సాలు చేశాడని పోలీసులు తెలిపారు. పై చిత్రంలో వృత్తంలో ఉన్న యువకుడే చెన్నయ్య.

More Telugu News