anupama parameshwaran: పెద్ద బ్యానర్ .. స్టార్ డైరెక్టర్ .. అయినా అనుపమ నో చెప్పేసిందట! కారణం .. ఇదే!

  • యూత్ లో అనుపమకు విపరీతమైన క్రేజ్ 
  • వరుసగా వస్తోన్న అవకాశాలు 
  • కెరియర్ పట్ల స్పష్టతతో వున్న అనుపమ

తెలుగులో యూత్ మనసులను పొలోమంటూ దోచేసిన కథానాయికలలో అనుపమ పరమేశ్వరన్  పేరు ముందు వరుసలో కనిస్తుంది. ప్రేమమ్ .. అ ఆ .. శతమానం భవతి సినిమాలు ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. లక్కీ హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి అనుపమ పరమేశ్వరన్ 'ఉన్నది ఒకటే జిందగీ' తోను ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా రిజల్ట్ మాట ఎలా వున్నా, ఆమె నటనకి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

 ఈ సినిమాలో కథ మధ్యలోనే ఆమె పాత్ర చనిపోతుంది. ఈ సినిమా తరువాత ఆమెకి ఓ ఆఫర్ వచ్చింది. పెద్ద బ్యానర్లో .. స్టార్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమా అది. ముందు ఎగిరిగంతేసిన అనుపమ .. ఆ తరువాత కథ విని ఉసూరుమందట. ఈ సినిమాలోను మధ్యలోనే చనిపోయే పాత్ర కావడమే అందుకు కారణం. అందువల్లనే ఆమె .. వెంటనే అదే తరహా పాత్రను చేయలేనంటూ సున్నితంగా తిరస్కరించిందట. ఈ కారణంగా పెద్ద సినిమాను వదిలేసుకుందంటే .. అనుపమ పక్కా ప్లానింగ్ తోనే ఉందనుకోవాలి మరి.    

More Telugu News