Jagan: జగన్ భాష మార్చుకోవాలి.. లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు: కళా వెంకట్రావు

  • జగన్ విచక్షణ, విలువలు లేని వ్యక్తి
  • వికీలీక్స్, ప్యారడైజ్ పేపర్లలో ఆయన పేరే వస్తుంది
  • విలువలు లేని పార్టీగా వైసీపీ నిలిచిపోతుంది

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో జగన్ వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని.. భాష మార్చుకోకపోతే ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ కు రాజకీయ విలువలు, విచక్షణ లేవని విమర్శించారు.

వికీలీక్స్, ప్యారడైజ్ పేపర్లలాంటి వాటిల్లో మన రాష్ట్రం నుంచి జగన్ పేరు వస్తోందని అన్నారు. అలాంటి వ్యక్తి పాదయాత్రలు చేస్తూ, చెప్పినవే చెప్పుకుంటున్నారని తెలిపారు. జగన్ నిలకడ లేని, పాలసీ లేని వ్యక్తి అని అన్నారు. మొదట ప్రత్యేక హోదా అన్నారని, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దల కాళ్లపై పడ్డారని, ఇప్పుడు మళ్లీ పాదయాత్ర కోసం పోరాటం చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. చివరకు ఎలాంటి నైతిక విలువలు లేని పార్టీగా వైసీపీ నిలిచిపోతుందని అన్నారు.

'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం విజయవంతంపై గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఈ రోజు సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కోటి కుటుంబాలను కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

More Telugu News