raghuram rajan: ఆర్బీఐ మాజీ గవర్నర్ కు రాజ్యసభ సీటు?

  • రాజన్ ను రాజ్యసభకు పంపాలనుకుంటున్న కేజ్రీవాల్
  • ఆప్ కు మూడు రాజ్యసభ సీట్లు
  • జనవరి నుంచి ప్రారంభం కానున్న పదవీకాలం

ఆర్మీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ను రాజ్యసభకు పంపే యోచనలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఉన్నట్టు సమాచారం. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ నుంచి ముగ్గురు సభ్యులను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. వీరి పదవీకాలం జనవరి నుంచి ప్రారంభం అవుతుంది. అయితే రాజకీయ నేతలను కాకుండా, ప్రొఫెషనల్స్ ను రాజ్యసభకు పంపాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

ఆర్బీఐ గవర్నర్ గా పదవీకాలం ముగిసిన అనంతరం షికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా రాజన్ పని చేస్తున్నారు. తన పదవిని రెండోసారి పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో... తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని రాజన్ ఎంచుకున్నారు. ఇక ఈ మూడు రాజ్యసభ సీట్ల కోసం ఆప్ లో పోటీ తీవ్రంగానే ఉంది. ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. 

More Telugu News