gautam gambir: తనకు ఎలాంటి బంతి వేయాలో ఆమెకి కూడా తెలిసిపోయిందన్న గౌతమ్ గంభీర్.. సలహా ఇచ్చిన షారుక్!

  • కుమార్తె స్కూల్ కి వెళ్లిన గంభీర్
  • గంభీర్ కూతురితో బౌలింగ్ చేయించిన స్కూల్ యాజమాన్యం
  • కూతురి బంతిని ఆడి..చాలా ఒత్తిడి ఎదుర్కున్నానన్న గంభీర్
  • కోల్ కతా నైట్ రైడర్స్ తరపున బౌలింగ్ చేయమనవా? అని అడిగిన షారూక్

తనకు ఎలాంటి బంతి వేయాలో తన కూతురికి కూడా తెలిసిపోయిందని టీమిండియా మాజీ ఓపెనర్, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గంభీర్‌ కు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి ఆజీన్‌ 2014, మే 1న జన్మించగా, రెండో అమ్మాయి అనైజా 2017 జూన్‌ 21న పుట్టింది. ఇటీవల ఆజీన్ చదువుతున్న స్కూల్ కు గంభీర్ వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడి టీచర్లు గంభీర్ కు సరదాగా ఆజీన్‌ తో బౌలింగ్‌ చేయించారు. చిన్నారి ఆజీన్‌ బంతిని విసిరింది.

ఆనాటి ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన గంభీర్... ‘నా కూతురు చదువుతున్న పాఠశాలలో ఆమె బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా ఒత్తిడితో కూడిన పని. నాన్నకు ఆఫ్‌ సైడ్‌ ది ఆఫ్‌ స్టంప్‌ వేయాలని ఆమెకు కూడా తెలిసిపోయింది!!!’ అంటూ ఆశ్చర్యంతో కూడిన వ్యాఖ్యను జతచేశాడు.

కాగా, గంభీర్ ఆఫ్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బంతులు ఆడడంలో బలహీనుడన్న సంగతి తెలిసిందే. ఈ బంతిని ఆడడంలోనే గంభీర్ చతికిలబడుతుండేవాడు. దీనిని చూసిన షారూఖ్ సరదాగా ‘కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తరఫున బౌలింగ్‌ చేయమని చెప్పవా ప్లీజ్‌?’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇది వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూడండి..   

More Telugu News