trump: కిమ్ కు అత్యంత సమీపంలో ట్రంప్... త్వరగా వెళ్లిపోవాలని వేడుకుంటున్న దక్షిణ కొరియన్లు!

  • సియోల్ లో బసచేసిన ట్రంప్
  • ఉత్తర కొరియా సరిహద్దులకు అత్యంత సమీపం
  • కిమ్, ట్రంప్ ఇంత దగ్గరకు రావడం ఇదే తొలిసారి
  • సియోల్ లో కనీవినీ ఎరుగని భద్రత

తన జపాన్ పర్యటనను ముగించుకుని దక్షిణ కొరియాలో డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టిన వేళ, అక్కడి ప్రజలు ఆయనెంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుండునని కోరుకుంటున్నారు. ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్న ప్రాంతానికి ట్రంప్ అతి దగ్గరగా రావడం ఇదే తొలిసారి. ట్రంప్ బసచేసి వున్న సియోల్ నగరం ఉత్తర కొరియా సరిహద్దులకు పట్టుమని 100 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. దక్షిణ కొరియా ప్రధాని మూన్ జా ఇన్ తో సమావేశమై, పలు ఒప్పందాలు, కీలక చర్చలు, చైనా సముద్రం, ఉత్తర కొరియాతో సంబంధాలు తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు.

కాగా, అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉన్న వివాదాల్లోకి తమను లాగారని, ట్రంప్ సాధ్యమైనంత త్వరగా తమ దేశం నుంచి వెళ్లిపోవాలని దక్షిణ కొరియన్లు వేడుకుంటున్నారు. ఆయన ఉన్నంత సేపూ ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న భయాందోళనల్లో కాలం గడపాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కాగా, ట్రంప్ బసచేసిన సియోల్ నగరానికి చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని అమెరికన్ సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. ట్రంప్ భద్రత కోసం దక్షిణ కొరియా, అమెరికా సైన్యాలు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేశాయి.

More Telugu News